హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నందమూరి సుహాసిని శనివారం రోడ్ షో నిర్వహించారు. మహాకూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థిగా కూకట్ పల్లి సీటుని సుహాసికి కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా.. గత వారం నామినేషన్ వేసిన ఆమె.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

శనివారం పార్టీ ముఖ్య నేతలతో కలిసి సుహాసిని రోడ్ షో నిర్వహించారు. కాలనీలో మొత్తం తిరుగుతూ.. ప్రజలను అభివందనం చేశారు. టీడీపీ కి ఓటు వేసి.. తనను గెలిపించాలని  ఆమె ప్రజలను కోరారు.  ఆమెతో పాటు టీడీపీ, కాంగ్రెస్ నేతలు కూడా ఈ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. సుహాసినికి మద్దతుగా బాబాయి బాలకృష్ణ, సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ లకు కాస్త విరామం దొరకగానే..వీరు ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. సినీ నటుడు జగపతి బాబు కూడా సుహాసినికి మద్దతు పలికారు.