మైనంపల్లి ఇన్: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నందికంటి శ్రీధర్

మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.  ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు  రాజీనామా లేఖను పంపారు.

Nandikanti sridhar Resigns To Congress lns

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మైనంపల్లి హన్మంతరావు  కాంగ్రెస్ లో చేరికతో నందికంటి శ్రీధర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని శ్రీధర్  రంగం సిద్దం చేసుకున్నారు.

అయితే  మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో  శ్రీధర్  కాంగ్రెస్ ను వీడారు.  మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ స్థానాలను మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో  నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ ను వీడుతున్నట్టుగా ప్రకటించారు. సోమవారంనాడు కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టుగా  ప్రకటించారు. రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు పంపారు.

Nandikanti sridhar Resigns To Congress lns

మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ స్థానాలను  మైనంపల్లి హన్మంతరావు కోరారు. అయితే మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే బీఆర్ఎస్ కేటాయించింది. దీంతో మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ ను వీడారు. మెదక్, మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాలను కేటాయించేందుకు కాంగ్రెస్ నాయకత్వం సానుకూలంగా స్పందించింది.

దీంతో గత నెల 28న మైనంపల్లి హన్మంతరావు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరడంతో  తనకు టిక్కెట్టు దక్కదని  నందికంటి శ్రీధర్ కు అర్థమైంది.దీంతో ఆయన  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.  ఇదిలా ఉంటే  మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కూడ నిన్న కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మెదక్ అసెంబ్లీ స్థానాన్ని తిరుపతి రెడ్డి ఆశించారు.

also read:మెదక్‌లో కాంగ్రెస్‌కు షాక్: డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి రాజీనామా

మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా  బరిలోకి దిగనున్నారు.మెదక్ నుండి  పోటీ చేయాలని తిరుపతి రెడ్డి రంగం సిద్దం చేసుకున్నారు. అయితే బీఆర్ఎస్ ను వీడి  కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి రోహిత్ మెదక్ నుండి బరిలోకి దిగనున్నారు. దీంతో  తిరుపతి రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. డబ్బులున్నవారికే కాంగ్రెస్ టిక్కెట్లు కేటాయిస్తుందని  తిరుపతి రెడ్డి ఆరోపించారు.మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరడంతో  ఆ పార్టీ నుండి ఇద్దరు జిల్లా పార్టీ అధ్యక్షులు బయటకు వచ్చారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో మైనంపల్లి హన్మంతరావును కాంగ్రెస్ లోకి ఆ పార్టీ ఆహ్వానించింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios