హైదరాబాద్:  మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ను బీజేపీలో చేరాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆహ్వానించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నందీశ్వర్ గౌడ్ టీడీపీలో చేరారు.

నందీశ్వర్ గౌడ్ టీడీపీ టిక్కెట్టుపై పటాన్‌చెరువు నుండి పోటీ చేయాలని భావించాడు. కానీ టీడీపీ కాంగ్రెస్ పొత్తు కారణంగా ఈ స్థానంలో నందీశ్వర్ గౌడ్ కు పోటీ చేసే అవకాశం దక్కలేదు.

నందీశ్వర్ గౌడ్ గతంలో బీజేపీలో ఉన్నారు. ప్రస్తుత ఎంపీ డి.శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితుడుగా నందీశ్వర్ గౌడ్ కు పేరుంది. డి.శ్రీనివాస్  కూడ ఇటీవల అమిత్ షాను కలిశారు. నందీశ్వర్ గౌడ్ ను కూడ బీజేపీలో చేరాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆయనను ఆహ్వానించారు.

ఈ నెల 18వ తేదీన అమిత్ షా హైద్రాబాద్ లో  నిర్వహించే సభలో పాల్గొంటున్నారు. ఈ సభలోనే పలువురు నేతలు  బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును బీజేపీలో చేరాలని లక్ష్మణ్ ఆహ్వానించారు. 

ఆ తర్వాత ఆయన నందీశ్వర్ గౌడ్ ను కలిసి బీజేపీలో చేరాలని ఆహ్వానించారు.నందీశ్వర్ గౌడ్ కూడ బీజేపీలో చేరేందుకు  సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం.

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ పిలువలేదు, బీజేపీలో చేరుతున్నా:మోత్కుపల్లి
కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ల భేటీ: బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు
అమిత్ షా తెలంగాణ టూర్: బీజేపీలోకి టీడీపీ నేతలు