టీడీపీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు నందమూరి తారక రామారావు 96వ జయంతి వేడుకలను పార్టీ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన జయంతి ని పురస్కరించుకొని... మంగళవారం ఎన్టీఆర్ ఘాట్‌ దగ్గర ఆయన మనవరాలు, హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని నివాళులు అర్పించారు. 

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళుగా ఎన్టీఆర్ భావించేవారని.. బడుగు, బలహీన వర్గాలు, మహిళల కోసం ఎంతగానో తపించారన్నారు.  అనంతరం ఎన్టీఆర్ చిన్న కుమారుడు రామకృష్ణ మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించింది ఎన్టీఆరేనని.. ప్రజల కోసం ఆయనపడ్డ తపన మరువ లేనిదన్నారు. రైతుల కోసం ఎన్టీఆర్ ఎంతగానో పాటుపడ్డారని.. ఎప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రామకృష్ణ వ్యాఖ్యానించారు.   

మంగళవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పురందేశ్వరులు నివాళులర్పించిన సంగతి తెలిసిందే.