డీఏవీ స్కూల్ అత్యాచార ఘటన.. నిందితులకు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ

బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ నిందితులు ప్రిన్సిపల్ మాధవీ, డ్రైవర్ రజనీ కుమార్‌లకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. నిందితులను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్ట్. 
 

nampally court allows 4 days police custody for dav school accused

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ నిందితులు ప్రిన్సిపల్ మాధవీ, డ్రైవర్ రజనీ కుమార్‌లకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అక్కడి నుంచి వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు. నిందితులను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్ట్. 

ఇకపోతే.. చిన్నారిపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో బంజారాహిల్స్ లోని డిఏవి పాఠశాల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అనుమతి లేని తరగతులను నిర్వహిస్తోందని, సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు లేదని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఐదవ తరగతి వరకు పాఠశాల విద్యా శాఖ అనుమతి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా ఆరు, ఏడు తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ నుంచి ఎన్వోసీ పొందిన తర్వాత సిబిఎస్ఈ సిలబస్ కు మారాలనుకుంటే ఆ బోర్డు నుంచి గుర్తింపు తీసుకోవాలి. అయితే, అదేమి లేకుండానే సీబీఎస్ఈ సిలబస్ తో తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి,

స్కూలుకు భారీ జరిమానా?
నగదు రూపేణ ఫీజులతో పాటు పలురకాల రుసుములు వసూలు చేస్తున్నారని విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఫీజులను ప్రిన్సిపల్ కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారని తెలిపారు. విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం డొనేషన్ లు వసూలు చేయరాదు. డిఏవి పాఠశాల రూ. 70వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ పాఠశాలకు భారీగా జరిమానా విధిస్తామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 6,7 తరగతుల విద్యార్థులకు అన్యాయం జరగకుండా పాఠశాల యాజమాన్యంతో  దరఖాస్తు చేయించి అనుమతి ఇస్తాం అని చెబుతున్నారు.

Also REad:తల్లిదండ్రులకు ఊరట.. బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ రీ ఓపెనింగ్‌కు ప్రభుత్వం సుముఖత

ప్రభుత్వానికి నివేదిక..
పాఠశాల గుర్తింపు రద్దును వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో డీఏవీ స్కూలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, డీఈవో ఆర్. రోహిణి సమక్షంలో 558 మంది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి తమ అభిప్రాయాలు వెల్లడించారు.  తల్లిదండ్రులు సూచనలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పాఠశాలల యాజమాన్యం ప్రకటించింది.

ఈ మేరకు కమిటీ శుక్రవారం కమిషనర్కు హామీ పత్రం అందించారు. తల్లిదండ్రులు అభిప్రాయాలు, కమిటీ హామీ తదితర అంశాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు శ్రీదేవసేన వివరించారు. బాధిత బాలిక వాంగ్మూలాన్ని కూడా శుక్రవారం కోర్టు నమోదు చేసింది. చంచల్గూడ జైలులోని ఇద్దరు నిందితులను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios