మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచర వర్గంగా భావిస్తున్న నేతలకు పార్టీ నాయకత్వం చెక్ పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డిని తొలగిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

రాజగోపాల్ రెడ్డితో పాటు జితేందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారనే ముందస్తు సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక, నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా రాజా రమేష్‌ను నియమించారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఈ నెల 21న మునుగోడులో జరిగే బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకోనున్నారు.