మంత్రి పుట్టినరోజు వేడుకల్లో అపశృతి, నల్గొండ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీకి గాయాలు

nalgonda trs incharge kancharla bhupal reddy injured in minister birthday celebrations
Highlights

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి, వేడుకల్లో పాల్గొనడానికి భారీ సంఖ్యలో అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. అయితే వీరిని నియంత్రించే ప్రయత్నంలో ఓ సీనియర్ టీఆర్ఎస్ నాయకుడికి స్వల్ప గాయాలయ్యాయి.
 
నిన్న మంత్రి జగదీష్ రెడ్డి పుట్టినరోజు వేడులకను నల్గొండ లో ఘనంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఉమ్మడి నల్గొండ జిల్లాల నుండి భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. వారంతా ఒక్కసారిగా స్టేజి పైకి రావడానికి ప్రయత్నించగా నల్గొండ టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి వారిని అదుపుచేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో ఆయన అదుపుతప్పి స్టేజి పై నుండి కిందపడ్డారు.

కాస్త ఎత్తునుండి కిందపడటంతో భూపాల్ రెడ్డి సడుముకు గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. అయితే ఆయన స్వల్పంగానే గాయపడినట్లు, దీనివల్ల ప్రమాదమేమీ లేనట్లు డాక్టర్లు చెబుతున్నారు.

loader