నల్గొండ- ఖమ్మం- వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల  లెక్కింపు ప్రక్రియలో 45 మంది అభ్యర్ధులు ఎలిమినేషన్ అయినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లాకు 228, కోదండరాంకు 258, తీన్మార్ మల్లన్నకు 184 ఓట్లు లభించాయి. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇప్పటి వరకు 1,11, 168 ఓట్లు లభించాయి. తీన్మార్ మల్లన్నకు 83,574, కోదండరామ్‌కు 70,322 ఓట్లు లభించాయి. 

అటు హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యతలో 8 మంది ఎలిమినేట్ అయ్యారు. రెండో ప్రాధాన్యతలో టీఆర్ఎస్ - 13, బీజేపీ - 7, ప్రొఫెసర్ నాగేశ్వర్ - 13, కాంగ్రెస్ - 7 ఓట్లు పొదారు.

రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి 8,028 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఉన్నారు. వాణీదేవి(తెరాస)  1, 12, 699, రామచందర్‌రావు(బీజేపీ) 1, 04, 671, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 53,623 ఓట్లు, చిన్నారెడ్డి (కాంగ్రెస్) 31,559 ఓట్లు పొందారు. మ్యాజిక్ ఫిగర్ 1,68,520 ఓట్లు కాగా,  వాణీదేవి గెలవాలంటే కావాల్సిన ఓట్లు 55, 831, రామచంద్రరావు గెలవాలంటే  కావాల్సిన ఓట్లు - 63, 852.