Asianet News TeluguAsianet News Telugu

పాప దొరికింది: అందుకే కిడ్నాప్ చేశా: నైనారాణి, అరెస్ట్

మూడు రోజుల క్రితం కోఠి  ప్రభుత్వాసుపత్రిలో చిన్నారిని కిడ్నాప్ చేసిన నైనారాణి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రెండు దఫాలు గర్భస్రావం కాడంతో పిల్లలు పుట్టరనే ఉద్దేశంతో చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు నైనా రాణి పోలీసులకు చెప్పారు.

Naina rani arrested for kidnap a baby in Koti hospital

హైద్రాబాద్‌ నగరంలోని కోఠి ప్రభుత్వాసుపత్రిలో సోమవారంనాడు చిన్నారికి టీకాలు వేయిస్తానని  ఓ మహిళ కిడ్నాప్ చేసింది. బీదర్ ప్రభుత్వాసుపత్రికిలో చిన్నారిని వదిలేసి వెళ్లిపోయింది. పోలీసులు తన కోసం  గాలింపు చర్యలు చేపడుతున్నారని గుర్తించిన ఆ మహిళ పసికందును బీదర్ ప్రభుత్వాసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది.

చిన్నారి తల్లి ఒడికి బుధవారం నాడు తెల్లవారుజామున చేర్చారు పోలీసులు.  అయితే చిన్నారిని కిడ్పాప్ చేసిన  మహిళ ఆచూకీ కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కృషి విజయవంతమైంది. 

 బీదర్ జిల్లాలోని  షాగంజ్‌కు చెందిన  నైనారాణి హైద్రాబాద్ కోఠి ప్రభుత్వాసుపత్రిలో చిన్నారిని కిడ్నాప్ చేసిందని గుర్తించారు.  ఆమె భర్త సైమన్ హైద్రాబాద్ ఎల్బీనగర్ పండ్ల మార్కెట్‌లో పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 

నైనారాణికి రెండు దఫాలు గర్భస్రావం అయింది. భవిష్యత్తులో పిల్లలు పుట్టరనే అనుమానంతోనే చిన్నారిని కిడ్పాప్ చేసినట్టు ఆమె టాస్క్‌ఫోర్స్ పోలీసులకు వివరించింది. శుక్రవారం నాడు బీదర్ నుండి హైద్రాబాద్‌కు వచ్చిన నైనా రాణి రెండు మూడు ఆసుపత్రులను పరిశీలించిన తర్వాత తనకు  కోఠి ప్రసూతి వైద్యశాల పనికొస్తోందని భావించింది.

టీకాలు వేయిస్తానని చెప్పి విజయ అనే మహిళ కూతురును కిడ్నాప్ చేసింది. అయితే బీదర్‌లో పోలీసుల నిఘా పెరిగడంతో వారి నుండి తప్పించుకొనేందుకు ఆమె చిన్నారిని ప్రభుత్వాసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios