Telangana: గుప్త నిధుల వేట.. తాంత్రిక పూజలు.. 10 మంది హత్య.. ?

Nagarkurnool: తాంత్రిక పూజ‌లు చేస్తూ 10 మంది ప్రాణాలు తీసిన ఘ‌ట‌న‌ నవంబర్ 26న నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. విచారించగా ఈ హత్యలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 
 

Nagarkurnool : 10 gruesome murders in the name of tantric worship in the hunt for hidden treasures RMA

Telangana News: ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది. నాగర్ కర్నూల్ లోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుప్తనిధుల వేటలో  తాంత్రిక పూజలతో 10కి పైగా హత్యలకు పాల్పడ్డాడనే వార్త కలకలం రేపుతోంది. గుప్తనిధుల ఆశతో బాధితులను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి హత్య చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్లు, పొలాల్లో గుప్తనిధుల వెలికితీత కోసం తాంత్రిక పూజలు చేస్తానని నిందితుడు అమాయకులను నమ్మించేవాడని తెలుస్తోంది. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి పేదల స్థిరాస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునే వాడు.

నిధి దొరికిన తర్వాత డబ్బులు చెల్లిస్తే భూమిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారని తెలుస్తోంది. డబ్బులు లేకపోవడంతో తమ భూములను తిరిగి రిజిస్ట్రేషన్ చేయించాలని బలవంతం చేసిన వారిని హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో 10కి పైగా హత్యలు చేసినట్లు సమాచారం. ఈ కేసులన్నీ ఆయా పోలీస్ స్టేషన్లలో అనుమానాస్పద మృతి కేసులుగా నమోదైనట్లు సమాచారం. ఈ హత్యలకు సంబంధించి పోలీసులు త్వరలోనే వివరాలు వెల్లడించే అవకాశముందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 

నవంబర్ లో వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యతో నిందితుల హత్యలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. నిందితులు అతని నుంచి డబ్బులు తీసుకుని క్షుద్ర‌పూజ‌ల పేరుతో తీసుకెళ్లి హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ లో ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. నవంబర్ 26న నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో ఈ హత్యలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడు నాగర్ కర్నూల్ చెందిన‌వ్య‌క్తి అని స‌మాచారం. నిందితుడు జిల్లా కేంద్రంలో కుటుంబంతో కలిసి ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడ‌నీ, 2018లో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తాంత్రిక పూజ‌ల విధానానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios