త్వరలోనే నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో జరిగిన రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. ( ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఫలితాలు ఇవాళ రాత్రి లేదా రేపటికి వెల్లడయ్యే అవకాశం ఉంది.)
హైదరాబాద్: త్వరలోనే నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో జరిగిన రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. ( ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఫలితాలు ఇవాళ రాత్రి లేదా రేపటికి వెల్లడయ్యే అవకాశం ఉంది.)
నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన రాములునాయక్ ను కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దింపింది. హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుండి మాజీ మంత్రి జి. చిన్నారెడ్డిని బరిలోకి దింపింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఇండిపెండెంట్ల కంటే తక్కువ ఓట్లను పొందారు.
కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుండి మాజీమంత్రి జీవన్ రెడ్డి గతంలో విజయం సాధించారు. దీంతో ఈ రెండు స్థానాల్లో కూడ పోటీకి కాంగ్రెస్ నేతలు ఉత్సాహం చూపారు. కానీ కాంగ్రెస్ పార్టీ పోటీకి ఆసక్తి చూపిన అభ్యర్ధుల జాబితాను వడపోసి రాములునాయక్,జి. చిన్నారెడ్డిలకు టిక్కెట్లు ఇచ్చారు.
ఈ రెండు స్థానాల నుండి గతంలో కూడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. నల్గొండ స్థానం లో తీన్మార్ మల్లన్న కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్ధికి వచ్చాయి. హైద్రాబాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డికి తక్కువ ఓట్లే దక్కాయి.
టీజేఎస్ చీప్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు. కానీ ఈ స్థానంలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని బరిలోకి దింపింది.
వచ్చే నెల 17వ తేదీన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలు జరిగే సమయంలో ఈ రెండు స్థానాల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహన్ని నింపాయి.
