తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి ఇవాళ చేదు అనుభవం ఎదురయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తన నియోజకవర్గ పరిధిలోని నాగార్జునపేట గ్రామానికి ప్రచారానికి వెళ్లారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న ఎన్నికల ప్రచార వాహానాన్ని గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలియజేశారు.  ఎంత సర్దిచెప్పినా వినకుండా జానారెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలారు. ముఖ్యంగా మహిళలు పలు సమస్యలపై ఆయన్ను నిలదీశారు.

దీంతో  సహనాన్ని కోల్పోయిన జానారెడ్డి తనను అడ్డుకున్న వారిని కాస్త ఘాటుగా బెదిరించారు. తనపై అభిమానం వున్న వారే ఓటేయాలని...లేని వారు ఎవరికైనా ఓటేసుకోవచ్చని సూచించారు. ఎవరి ద్వారా పనులు జరుగుతాయో అక్కడే చేసుకోవాలంటూ తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. స్థానిక నాయకులు ప్రచారానికి అడ్డుతగిలిన వారిని సముదాయించి అక్కడి నుండి వెళ్లగొట్టడంతో జానారెడ్డి ప్రచార వాహనం ముందుకు కదిలింది.   

వీడియో