గ్రీన్ ఛాలెంజ్‌ స్వీకరించిన నాగార్జున... తన కోడలు సమంతాకే సవాల్...

Nagarjuna Accepts MP Santosh Kumar's Green Challenge
Highlights

ఇప్పుడు తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ పేరుతో చెట్లను నాటడంతో పాటు ఇతరులతో నాటించే బృహత్తర కార్యక్రమం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అటవీ సంపదను పెంచి, కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో హరితహారం చేపడుతోంది. ఇందులో రాజకీయ, సినీ,క్రీడా, సామాన్య ప్రజల్నిభాగస్వామ్యం చేసి వారితో చెట్లు నాటించడానికి పుట్టుకొచ్చిందే గ్రీన్ ఛాలెంజ్ కాన్సెప్ట్. 
 
ఇప్పటికే ఈ గ్రీన్ ఛాలెంజ్ ను తెలంగాణలోని ప్రముఖులంతా ఫాలో అవుతున్నారు. తెలంగాణ మంత్రులు, టాలీవుడ్ నటులు, క్రీడాకారులు ప్రముఖంగా ఈ ఛాలెంజ్ ను ఒకరికొకరు విసురుకుంటున్నారు. ఇప్పటికే కేటీఆర్, కవిత, గవర్నర్ నరసింహన్, హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు క్రిడాకారులు సచిన్, లక్ష్మణ్, సైనా నెహ్వాల్, గోపిచంద్ వంటి ప్రముఖులంతా ఈ ఛాలెంజ్ లో పాల్గొని చెట్లను నాటారు. ఇపుడు ఈ ఖాతాలో హీరో నాగార్జున కూడా చేరిపోయారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలోని గార్డెన్ లో చెట్లు నాటారు. స్టూడియో సిబ్బందితో కలిసి చెట్లు నాటి ఆ పోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అనంతరం మరికొంతమందికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. తన కోడులు సమంతాతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్, తమిళ్ నటులు కార్తీ, ధనుష్ లకు ఈ ఛాలెంజ్ విసిరారు. 
 
loader