అమ్రాబాద్ అడవిలో పెద్దపులి కనువిందు చేసింది. రాత్రిపూట పెట్రోలింగ్ లో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ కు దారి మధ్యలో పెద్దపులి కనిపించింది. దాన్ని ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నాగర్ కర్నూల్ : డైలీ డ్యూటీ లో భాగంగా అమ్రాబాద్ అడవిలో రాత్రి పూట పెట్రోలింగ్ చేస్తుండగా నాగర్ కర్నూల్ జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ రెడ్డికి పెద్ద పులి కనబడింది. దీన్ని ఆయన తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఆ వీడియోను వేల సంఖ్యలో వీక్షించారు. డిఎఫ్ఓ రోహిత్ రెడ్డితోపాటు అమ్రాబాద్ అటవీ సిబ్బందిని పలువురు ట్విట్టర్ వేదికగా అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పులుల సంరక్షణ, అటవీ జంతువుల సంరక్షణ కు తీసుకున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వంను, ఆటవి శాఖ సిబ్బందిని ఈ సందర్భంగా పలువురు నేటిజెన్స్ అభినందించారు.
ఆమె పులిని జయించింది.. 15 నెలల చిన్నారికోసం ఒట్టి చేతులతో పులితో వీరోచిత పోరాటం చేసిన మాతృమూర్తి..
ఇదిలా ఉండగా, నిరుడు మార్చి లో నాగర్ కర్నూలు, అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ లో ఇప్పపువ్వు కోసం వెళ్లిన గిరిజనులను ఫారెస్ట్ అధికారులు దారుణంగా కొట్టారు. మన్ననూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇప్పపువ్వు కోసం కొందరు గిరిజనులు వెళ్లారు. వీరిని అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా కొట్టారు.
దీంతో పదిమంది గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దీంతో అటవీ అధికారులు ఆగకుండా ఆ గిరిజనులను మన్ననూర్ బేస క్యాంపులో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు పెద్ద సంక్యలో అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులమీద దాడి చేశారు. దీంతో గిరిజనుల దాడిలో పలువురు ఫారెస్ట్ అధికారులకు గాయాలు అయ్యాయి.
తమవారిమీద అటవీ అధికారులు దాడి చేయడాన్ని, తీవ్రంగా గాయపరచడం మీద గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల్నుంచి అటవీశాఖ సిబ్బంది తమను వేధిస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిలో దొరికే ఇప్పపువ్వు కోసం తాము వెళితే పోలీసులు అకారణంగా తమను గాయపరిచారని బాధితులు తెలిపారు.
పోలీసుల దాడికి నిరసనగా గిరిజనులు పెద్ద సంఖ్యలో జాతీయ రహదారిమీద ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిమీద పలు వాహనాలు నిలిచిపోయాయి.
