రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందులు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ అంతటా విందుల హడావిడి ఉంది. నాగర్ కర్నూల్ పట్టణంలో సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ముస్లిం సోదరులకు నాగం జనార్దన్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం మౌజాన్ ఈమామ్ లకు శాలువాతో సత్కరించారు.  ముస్లిం సోదరులకు రంజాన్ పండగా శుభాకాంక్షలు తెలిపారు.గతంలో మజీద్ లకు, ఈద్గా లకు,దర్గా లకై ఎంతో సహాయం చేసానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాగం చిరకాల ప్రత్యర్థి, వనపర్తి ఎమ్ఎల్ ఎ చిన్నారెడ్డి హాజరు కావడం చర్చనీయాంశమైంది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపి మల్లు రవి కూడా పాల్గొన్నారు.