నల్గొండ జిల్లాలోని మాడ్గులపల్లి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన కొండేటి నాగయ్య స్వంత ఇంటి నిర్మాణం కోసం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుండి ఏడాది క్రితం రూ. లక్ష అప్పు తీసుకొన్నాడు. కరోనా కారణంగా ఈ అప్పు చెల్లించడానికి ఆయన కు ఆలస్యమైంది.

అప్పు చెల్లించకపోతే ఇంటికి తాళం వేస్తామని ఫైనాన్స్ కంపెనీ ఏజంట్లు నాగయ్యను బెదిరించారు. దీంతో నాగయ్య తెలిసినవారి నుండి రూ. 2 లక్షలు అప్పు తీసుకొన్నాడు.ఈ అప్పులు తీర్చే మార్గం నాగయ్యకు కన్పించలేదు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. భార్యాపిల్లలను అత్తగారిల్లైన గుట్టకింది అన్నారానికి మంగళవారం నాడు తీసుకెళ్లాడు.
హెల్త్ చెకప్ కోసం నల్గొండ వెళ్తున్నానని చెప్పి ముషంపల్లి రోడ్డులోని చర్చి వెనక పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని నాగయ్యను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగయ్య మరణించాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.