Asianet News TeluguAsianet News Telugu

హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ పేకాట కేసులో నిందితులు వీరే, ప్రధాన గ్యాంబ్లర్ సుమన్

హైదరాబాదులోని మాచిరేవులలో గల హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతూ పట్టుబడిన 30 మందిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆ నిందితుల పేర్లు ఇలా ఉన్నాయి.

Naga Shorya Farm House gamling vase: these are accused
Author
Hyderabad, First Published Nov 1, 2021, 7:20 PM IST

హైదరాబాద్: తెలుగు సినీ హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతూ పట్టుబడిన 30 మందిని పోలీసులు రాజేంద్రనగర్ పరిదిలోని ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎస్వోటీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులకు చిక్కకుండా జూదాలను సుమన్ కుమార్ పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

పేకాట ఆడుతూ పట్టుబడినవారిలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాంభద్రయ్య కూడా ఉండడం విశేషం. శ్రీరాంభద్రయ్యకు ఆస్పత్రిలో వైద్యపరీక్షల నిర్వహించి, మిగతా నిందతులతో పాటు ఆయనను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. 30 మంది నిందితులను పోలీసులు రెండు వాహనాల్లో కోర్టుకు తరలించారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంటే, నవంబర్ 15వ తేదీ వరకు వారికి రిమాండ్ విధిచింది. 

నిందితులు వీరే....

1. గుత్తా సుమన్ కుమార్ (ప్రధాన గ్యాంబ్లర్)
2. శ్రీరాంభద్రయ్య, మాజీ ఎమ్మెల్యే, మహబూబాబాద్
3. మారీడు తరుణ్, విజయవాడ వ్యాపారి
4. గుమ్మడి రామస్వామి, సివిల్ కాంట్రాక్టర్, హైరదాబాద్
5. నడిగ ఉదయ్ డైరెక్టర్ హైదరాబాద్
6. సిహెచ్ శ్రీనివాస రావు, వ్యాపారి, మచిలీపట్నం
7. పి. శివరామకృష్ణ, వ్యాపారవేత్త హైదరాబాద్
8. బడిగె సుబ్రమణ్యం, వ్యాపారవేత్త, ఫిలింనగర్, హైదరాబాద్
9. పడితాపు సురేష్, జ్యువెలరీ వ్యాపారి, గుంటూరు
10. ప్రైవేట్ ఉద్యోగి, సికింద్రాబాద్
11. వెంకటేష్, జ్యువెలరీ వ్యాపారి, గుంటూరు
12. మిర్యాల భానుప్రకాశ్, వ్యాపారవేత్త, హైదరాబాద్
13. పాతురి తిరుమల్ రావు, ప్రైవేట్ ఉద్యోగి, విజయవాడ
14. వీర్ల శ్రీకాంత్, సాఫ్ట్ వేర్ ఇంజనీరు, హైదరాబాద్
15. మద్దులప్రకాశ్, వ్యాపారవేత్త, రంగారెడ్డి
16. సివీఎస్ రాజారామ్, వ్యాపారవేత్త, మాదాపూర్, హైదరాబాద్
17. కె. మల్లికార్డునరెడ్డి, వ్యాపారవేత్త, నంద్యాల
18. బొగ్గారపు నాగరాజు, వ్యాపారవేత్త, నంద్యాల
19. గట్టు వెంకటేశ్వర రావు, జ్యువెలరీ వ్యాపారి, తెనాలి
20. ఎస్ఎస్ఎన్ రాజు, ప్రైవేట్ ఉద్యోగి, విశాఖపట్నం
21. యు. గోపాలరావు, వ్యాపారవేత్త, మాదాపూర్, హైదరాబాద్
22. బి. రమేష్ కుమార్, వ్యాపారవేత్త, మల్కాజిగిరి, సికింద్రాబాద్
23. కాంపల్లి శ్రీనివాస్, వ్యాపారవేత్త, కూకట్ పల్లి, హైదరాబాద్
24. ఇమ్రాన్ ఖాన్, వ్యాపారవేత్త, నిర్మల్
25. టి. రోహిత్, వ్యాపారవేత్త, హైదరాబాద్
26. బొల్లబోల ఆదిత్య, వ్యాపారవేత్త, ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదరాబాద్
27.తోట ఆనంద్ కిశోర్, కేటరింగ్, హైదరాబాద్
28. షేక్ ఖాదర్, డ్రైవర్, హనుమాన్ జంక్షన్
29. బి. రాజేశ్వర్, వ్యాపారవేత్త, రంగారెడ్డి జిల్లా
30. మరొకరు

మంచిరేవుల ఫామ్ హౌస్ లో హీరో నాగశౌర్యకు చెందిన ఫామ్ హౌస్ లో ఎస్వీటీ పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి 30 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన గ్యాంబ్లర్ గుత్తా సుమన్ కుమార్ కు గతంలో నేర చరిత్ర ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రధాన గ్యాంబ్లర్ సుమన్ మీద భూకబ్జా కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సుమన్ మొబైల్ లోని ప్రముఖుల పేర్లను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Also Read: హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట:30 మంది పేకాటరాయుళ్లకు 14 రోజుల రిమాండ్

Follow Us:
Download App:
  • android
  • ios