సస్పెన్స్‌కు చెక్.. బీఆర్ఎస్‌కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా
గత కొద్దిరోజులుగా జరుగుతున్న హైడ్రామాకు తెరపడింది. బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు.
గత కొద్దిరోజులుగా జరుగుతున్న హైడ్రామాకు తెరపడింది. బీఆర్ఎస్‌కు ఆ పార్టీ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మైనంపల్లి తనతో పాటు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ నుంచి టికెట్ ఆశించారు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్ధుల జాబితాలో మల్కాజిగిరి నుంచి హనుమంతరావుకు టికెట్ కేటాయించగా.. రోహిత్‌కు మాత్రం నిరాకరించారు.
ఈ పరిణామాలతో మైనంపల్లి హనుమంతరావు రగిలిపోయారు. తన కొడుక్కి టికెట్ రాకుండా చేశారంటూ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని, మైనంపల్లి ప్లేస్‌లో మల్కాజిగిరిలో మరొకరికి ఛాన్స్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ అలాంటివేవి చోటు చేసుకోలేదు. మల్కాజిగిరిలో మైనంపల్లి, మెదక్‌లో రోహిత్ పర్యటిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్‌ను వీడి .. కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. తండ్రీకొడుకులిద్దరికి ఆ పార్టీ టికెట్ ఆఫర్ చేసిందని.. దీంతో మైనంపల్లి త్వరలోనే బీఆర్ఎస్‌ను వీడుతారంటూ ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆయన ఏటూ తేల్చులేక అలాగే కాలం గడిపేశారు. అయితే కార్యకర్తలు, అనుచరుల సూచన మేరకు బీఆర్ఎస్‌ను వీడాలనే మైనంపల్లి హనుమంతరావు నిర్ణయించుకున్నారు.