Asianet News TeluguAsianet News Telugu

మా నిఖాకి మీ ‘తలాక్’ ఏంటీ

కోర్టులు నిషేధం విధించినా తమిళుల సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వారి జల్లికట్టు క్రీడపై ప్రత్యేక ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం తమ మతస్తుల మనోభావాలను ఎందుకు పరిగణించడం లేదో చెప్పాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సూటిగా ప్రశ్నిస్తున్నారు.

Muslims stand in support of triple talaq just like jallikattu says Owaisi

 

తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టు పై కోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో తంబీలంతా ఏకమై నిషేధానికి వ్యతిరేకంగా గళమెత్తారు. మెరీనా బీచ్ లో రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి అనుకున్నది సాధించారు. కోర్టు వద్దన్నా కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి ఆర్డినెన్స్ ద్వారా జల్లికట్టు పై నిషేధాన్ని తొలగించికున్నారు.

 

ఓ సాంప్రదాయ ఆటకోసమే రాజకీయాలకు అతీతంగా తమిళమంతా ఏకమై ఎళుగెత్తి పోరాడిన తీరు మరెన్నో ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడు పక్కనే ఉన్న కర్ణాటకలో కూడా ప్రజలు  జల్లికట్టు స్ఫూర్తి తో కంబాల పై  నిషేధానికి వ్యతిరేకంగా ఏకమై పోరాడుతున్నారు.

 

ఇక ఈ జల్లికట్టు స్ఫూర్తి నవ్యాంధ్ర ప్రదేశ్ కు తాకిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం నాడు విశాఖపట్నంలో జల్లికట్టు తరహాలో ఉద్యమించాలని ఆంధ్రా యువత సోషల్ మీడియాలో పిలునిచ్చింది.

 

జల్లికట్టు తరహాలోనే చాలా మంది తెలుగు సినీ హీరోలు ఏపీ ప్రత్యేక ఉద్యమానికి మద్దతు పలికారు. అయితే ప్రభుత్వం ఉక్కుపాదంతో దీన్ని అణిచివేడయంతో అనుకున్న స్థాయిలో ఉద్యమం విజయవంతం కాలేదు.

 

ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చిన జల్లికట్టు ఉద్యమం ఇప్పుడు మతాలకు కూడా స్ఫూర్తినిచ్చేలా కనిపిస్తోంది.

 

ఎందుకంటే జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరో తేనెతుట్టెను కదిపారు. దేశంలో వివాదాస్పదంగా మారి, ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న త్రిపుల్ తలాక్ పై ఆయన కేంద్ర వైఖరిని సూటిగా ప్రశ్నించారు.

 

కోర్టులు నిషేధం విధించినా తమిళుల సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వారి జల్లికట్టు క్రీడపై ప్రత్యేక ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం తమ మతస్తుల మనోభావాలను ఎందుకు పరిగణించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింల సంప్రదాయాలకు విరుద్ధంగా హిందూ సంస్కృతిని తమపై రుద్దాలని చూడడం సరికాదంటున్నారు.

 

త్రిపుల్ తలాక్ ను నిషేధించాలనే కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జల్లికట్టు తరహాలో దీనిపై ఉద్యమించాలని ముస్లింలకు పిలుపునిచ్చారు.

 

ఓ సంప్రదాయ క్రీడ కోసం ఆర్డినెన్స్ లు జారీ చేసిన ప్రభుత్వాలు తమ సంస్కృతి ని కాలరాయాలని చూడడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

 

తమిళుల్లాగే  ముస్లింలకు సొంత సంస్కృతి ఉందని,  తమకు నచ్చినట్టు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు తీసుకుంటామని దానికి ప్రభుత్వాలు అడ్డు చెప్పడమంటే తమ మత విధానాన్ని కాలరాయడటమే అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios