ములుగు: హిందూ-ముస్లిం భాయీ భాయీ అని నిరూపించారు ఓ ముస్లిం సోదరుడు. అందుకు వినాయకచవితి వేడుకలే వేదిక అయ్యింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో వినాయక నిమజ్జనోత్సవంలో భాగంగా బుధవారం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో ఓ ముస్లిం యువకుడు పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాడు. 

 బొడ్రాయి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద నిర్వహించిన ఈ వేలంపాటలో ఎం.డి అఫ్జల్‌పాషా పాల్గొన్నారు. ఒకటి కాదు ఏకంగా రెండు లడ్డూలను దక్కించుకున్నాడు. రూ.20,516కు ఒక లడ్డూ, రూ.8,716కు మరొక లడ్డూను దక్కించుకున్నాడు. 

అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. లడ్డూలు కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందని అఫ్జల్ పాషా స్పష్టం చేశాడు. తన కుటుంబం సుభిక్షంగా ఉండాలనే లడ్డూలను దక్కించుకున్నట్లు తెలిపాడు.