Asianet News TeluguAsianet News Telugu

కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. నేడు దుబ్బాక బంద్..

బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి నిరసనగా నేడు దుబ్బాక బంద్ జరుగుతోంది. 

Murder attempt on kotta Prabhakar Reddy, Dubbaka Bandh today - bsb
Author
First Published Oct 31, 2023, 8:52 AM IST

దుబ్బాక : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై సోమవారం నాడు దుబ్బాకలో  హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా  మంగళవారం దుబ్బాక బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. హత్యాయత్నానికి పాల్పడిన నిందితులు, రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నాయి. రాయపోల్, దుబ్బాక, తోగుట, దౌల్తాబాద్, మిరుదొడ్డి, చేగుంట, నార్సింగి, అక్బర్ పేట- భూంపల్లి మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి.

ఇక దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి నిరసనగా దుబ్బాక బీజేపీ ఎంపీ రఘునందన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో బంద్ లో భాగంగా మండల కేంద్రాలు, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటలకు నల్లజెండాలతో నిరసన కార్యక్రమాల చేపట్టాలని  బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ మేరకు దుబ్బాకలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios