భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగర ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్‌పై హత్యాయత్నం జరిగింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో అభిమన్యు అనే వ్యక్తి స్క్రూడ్రైవర్‌తో అరుణ్‌పై దాడి చేశాడు.

సుమారు 20 సార్లు ఆయన్ను విచక్షణారహితంగా పొడిచాడు. వెంటనే స్పందించిన స్థానికులు అరుణ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.