తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మురళీధర్ రావు. అందరినీ కలుపుకునే పోయేందుకే సంజయ్‌ని తప్పించారేమోనంటూ ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. 

సంక్షేమ పథకాలతో కేసీఆర్‌ను కొట్టలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత మురళీధర్ రావు. శుక్రవారం ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కేసీఆర్‌ను కొట్టాలంటే ఇచ్చిన హామీల అమలులో లోపాలతోనే కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పుతో పార్టీ డ్యామేజ్ అయ్యిందనడం సరికాదన్నారు. ఎందుకు మార్చారనేది మార్చినవాళ్లకు బాగా తెలుసునని మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. నేతలను కలుపుకునిపోవడం కోసం బండిని తప్పించి వుండొచ్చిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇకపోతే.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సంజయ్‌ని తొలగించిన బీజేపీ.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. బండి సంజయ్ సేవలను రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశాల్లోనూ బండి సంజయ్‌ సేవలను వినియోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నది. అందుకే ఈ రాష్ట్రాల బాధ్యతలనూ ఆయనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.