Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ఉపఎన్నిక: టీఆర్ఎస్ నేత ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్టును వ్యతిరేకిస్తున్న లోకల్ లీడర్లు..

Munugodu: మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని అన్ని ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కోసం ఇప్పటికే ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి అన్ని ప్రయత్నాలను ప్రారంభించాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు నువ్యా-నేనా అనే విధంగా ముందుకు సాగుతున్నాయి.
 

Munugodu by-election: Local leaders are opposing TRS leader Prabhakar Reddy's ticket.
Author
First Published Sep 23, 2022, 10:54 AM IST

by-election: ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలన్ని మునుగోడు అసెంబ్లీ నియోజకర్గం చూట్టే తిరుగుతున్నాయి. అక్కడ జరిగే  ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని అన్ని ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కోసం ఇప్పటికే ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు నువ్యా-నేనా అనే విధంగా ముందుకు సాగుతున్నాయి. అధికార పార్టీ ఈ ఎన్నికతో ప్రతిపక్షాల దూకుడుకు చెక్ పెట్టాలని చూస్తోంది. అయితే, ఇప్పుడు టీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. పార్టీ శ్రేణులు, లోకల్ లీడర్లు అధిష్ఠానంపై అక్కడ పోటీకి నిలబెట్టే అభ్యర్థి విషయంలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పాల్వాయి గోవర్థన్ కుమార్తె పాల్వాయి స్రవంతిని  అభ్యర్థిగా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు. 

ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ నిరాకరించాలని స్థానిక టీఆర్‌ఎస్ నేతలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. పార్టీ తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనప్పటికీ, గత రెండు రోజులుగా ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వానికి పార్టీ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు వంటి కొద్దిమంది స్థానిక నాయకులు టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. మరికొంత మంది టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డికి అధిష్టానం మద్దతు ప్రకటిస్తే.. పార్టీ వీడటంతో పాటు బీజేపీలో చేరుతామంటూ హెచ్చరించారు. దీంతో ఏం చేయాలి.. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో ఎలా ముందుసాగాలోనని నొత్తిపట్టుకోంటున్నదని సమాచారం. బుధవారం చండూరు జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీటీసీలు అవ్వారు గీత, చెరిపల్లి భాస్కర్‌లు మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. మంగళవారం వరకు ఇంధన శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డితో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్న నల్గొండ జిల్లాలో ఈ అనూహ్య పరిణామంతో టీఆర్‌ఎస్‌ను కంగుతింది.  వీరంతా జగదీశ్‌రెడ్డికి అత్యంత ఆప్తమిత్రులని కింది స్థాయి నాయకులు చెబుతున్నారు. 

జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలోకి చేరడంతో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వెంటనే డ్యామేజ్ కంట్రోల్ మోడ్‌లోకి వెళ్లింది. పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు, తన వర్గాన్ని కలిసి ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. పలువురు అగ్రనాయకులున రంగంలోకి దింపుతున్నదని తెలిసింది. ప్రభాకర్ రెడ్డికి పార్టీ టిక్కెట్ ఇస్తే టీఆర్‌ఎస్‌ని వీడి బీజేపీలో చేరతామని కొన్ని గ్రామాల సర్పంచ్‌లతో పాటు మరికొంత మంది స్థానిక నాయకులు బెదిరించినట్లు సమాచారం. ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించిందనీ, పార్టీ ప్రచారంలో ప్రభాకర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రమే పాల్గొనే అవకాశం ఉన్నందున ప్రకటన కేవలం లాంఛనమే అని స్థానిక పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే, స్థానిక నాయకుల వ్యతిరేకతో అగ్రనాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా, కాంగ్రెస్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా, బీజేపీ సైతం మునుగోడులో విజయం సాధించింది తన దూకుడును కొనసాగించాలని చూస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios