Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేసి బ్యాలెట్ పేపర్‌తో నిర్వహించాలి.. కేఏ పాల్ సంచలన కామెంట్స్..

మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Munugode Bypoll Results updates KA Paul Demands to cancel the election
Author
First Published Nov 6, 2022, 11:38 AM IST

మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో భారీ స్థాయిలో ప్రలోభాలు జరిగాయని.. ఆ విషయంపై తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. పోలింగ్ పూర్తైన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టాలని..సెంట్రల్ ఫోర్స్‌తో వీటిని నడపాలని కోరారు. 

ఇప్పుడున్న కలెక్టర్, ఎస్పీ, ఆర్వో, ఇంతకు ముందు ఉన్న ఆర్వో.. కేసీఆర్ తొత్తులు అని ఆరోపించారు. పోలింగ్ ముగిసిన తర్వాత వెంటనే ఓట్ల లెక్కింపు జరపాలని.. మూడు రోజుల గ్యాప్ ఎందుకని ప్రశ్నించారు. ఈ ఎన్నికలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ ఎన్నికను రద్దు చేసి.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికను నిర్వహించాలని కోరారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల్లో చాలా మంది ఇదే కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇక, మునుగోడు ఉప ఎన్నిక నాలుగు రౌండ్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే సరికి కేఏ పాల్‌కు 174 ఓట్లు వచ్చాయి. 

మునుగోడులో ప్రచారంలో కేఏ పాల్ తనదైన శైలిలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. డ్యాన్స్‌లు చేయడం, రైతు వేషం వేసి పొలం పనులకు వెళ్లడం, పోలింగ్ రోజు చేతికి ఉంగరాల ధరించి బూత్‌లోకి వెళ్లడం, పరుగులు తీస్తూ కనిపించడం.. వంటి ఘటనలు వైరల్‌గా మారాయి. ప్రతి సందర్భంలో కూడా కేఏ పాల్.. తాను విజయం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేశారు.  

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్​లో కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం మునుగోడులో టీఆర్ఎస్,‌బీజేపీల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది. ఇప్పటివరకు నాలుగు రౌండ్స్ ఫలితాలు వెలువడగా.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 700 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇక, మునుగోడు ఉప ఎన్నిక తుది ఫలితం మధ్యాహ్నాం ఒంటిగంట కల్లా వచ్చే అవకాశముంది. తొలుత చౌటుప్పల్ మండల ఓట్లను లెక్కించారు. ఇంకా నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పుల్​ మండలాల ఓట్లను లెక్కించాల్సి ఉంది. 

మునుగోడు ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లలో 2,25,192 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ అదికారులు తెలిపారు. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో 91.31 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లలో 2,25,192 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇక్కడ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 91.31 శాతం పోలింగ్ నమోదైంది.

Follow Us:
Download App:
  • android
  • ios