మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్‌లో కొనసాగుతుంది. మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియపై స్పందించిన తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్‌లో కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. అయితే ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతుందని టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియపై స్పందించిన తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల పరిశీలకులు ఫలితాల వెల్లడిలో ఆలస్యం చేస్తున్నారనే తమ అభ్యర్థి సమాచారం ఇచ్చారని చెప్పారు.
కౌంటింగ్ సరిగా జరిగానే తర్వాతనే ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫలితాలపై బీజేపీ నాయకులు ఎన్నికల అధికారులు ఇచ్చినట్టుగా తప్పుడు సమాచారం ఇచ్చి.. ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తయ్యాక అధికారులే మీడియాకు వివరాలు వెల్లడించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర మంత్రి ఫోన్ చేయడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు. బీజేపీవి మొదటి నుంచి తప్పుడు విధానాలేనని ఆరోపించారు. వాళ్లు అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదని బీజేపీ అభ్యర్థే చెప్పారని అన్నారు. ఇక, మునుగోడు ప్రజలు ధర్మం వైపు, న్యాయం వైపే ఉన్నారని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇక, మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్‌లో కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం మునుగోడులో టీఆర్ఎస్,బీజేపీల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది. ఇప్పటివరకు ఐదు రౌండ్స్ ఫలితాలు వెలువడగా.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 1,400 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే.. మునుగోడు ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లలో 2,25,192 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ అదికారులు తెలిపారు. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో 91.31 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లలో 2,25,192 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇక్కడ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 91.31 శాతం పోలింగ్ నమోదైంది.
