Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు బైపోల్ 2022: ఫలితాల వెల్లడిలో జాప్యంపై బండి సంజయ్ ఆగ్రహం

మునుగోడు ఉప  ఎన్నికల  ఫలితాల వెల్లడిలో జాప్యంపై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి  సంజయ్  ఆరోపించారు.
 

 Munugode Bypoll 2022:BJP Telangana President Bandi Sanjay  Serious  Comments On  Telangana  CEO
Author
First Published Nov 6, 2022, 11:30 AM IST

మునుగోడు:  మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడి అనుమానాస్పదంగా ఉందని   బీజేపీ  ఆరోపించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్  రాజుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్  విమర్శలు గుప్పించారు.

also  read:మునుగోడు బైపోల్ 2022: కూసుకుంట్లకు స్వగ్రామంలోనే షాక్, కోమటిరెడ్డి లీడ్

ఈ  మేరకు ఇవాళ ఆయన   ఓ  పత్రిక  ప్రకటనను విడుదల  చేశారు. టీఆర్ఎస్ కి లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడం  లేదని   ఆయన ఆరోపించారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించడం  లేదని  ఆయన  ఆరోపించారు.మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని  ఆయన ప్రశ్నించారు.  ఫలితాల విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన  అడిగారు.

Follow Us:
Download App:
  • android
  • ios