Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు బైపోల్ 2022: రెండు రౌండ్లు మినహా అన్నింటిలో టీఆర్ఎస్‌దే పైచేయి

మునుగోడు  ఉప ఎన్నికల్లో  రెండు రౌండ్లలో మినహా  ఇతర రౌండ్లో  బీజేపీ లీడ్ ను సాధించలేకపోయింది. బీజేపీ  ఎక్కువగా చౌటుప్పల్,  చండూరు  మున్సిపాలిటీపై  కేంద్రీకరించింది. చండూరులో  బీజేపీకి  ఆశించిన  ఫలితం  బీజేపీకి  దక్కలేదు.  
 

Munugode bypoll 2022:BJP Candidate Komatireddy  Rajagopal Reddy Leads    only in two rounds
Author
First Published Nov 6, 2022, 5:38 PM IST

మునుగోడు:మునుగోడు ఉప  ఎన్నికలో  టీఆర్ఎస్  విజయం  సాధించింది. రెండు  రౌండ్లలో  మినహా ఏ రౌండ్ లో కూడ బీజేపీ  మెజారిటీని దక్కించుకోలేకపోయింది. చౌటుప్పల్  పట్టణంలోని  బీజేపీ  ప్రభావిత  పోలింగ్ కేంద్రాల్లో  మినహా  మిగిలిన చోట్ల బీజేపీకి ఆధిక్యత  లభించింది.  మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యతను  సాధించింది. రెండు, మూడు   రౌండ్లలో బీజేపీ  లీడ్ లో ఉంది., నాలుగో  రౌండ్  నుండి  15 వ  రౌండ్ వరకు  టీఆర్ఎస్  లీడ్ లో  కొనసాగింది.

మొదటి రౌండ్  లో  టీఆర్ఎస్ కు  1292  ఓట్ల  మెజారిటీ దక్కింది. రెండో రౌండ్  లో  బీజేపీకి  841  ఓట్ల మెజారిటీ, మూడో రౌండ్ లో  బీజేపీకి 36 ఓట్ల  లీడ్  దక్కింది. నాలుగో రౌండ్  నుండి  టీఆర్ఎస్ ను బీజేపీ నిలువరించలేకపోయింది.  నాలుగో  రౌండ్  లో టీఆర్ఎస్  కు  299  ఓట్ల  మెజారీటీ,ఐదో రౌండ్  లో  917  ఓట్ల  లీడ్  దక్కింది.  ఆరో  రౌండ్  లో 638 , ఏడో  రౌండ్  లో 386 ఓట్ల మెజారిటీ లభించింది. ఎనిమిదో  రౌండ్ లో 532 ఓట్లు , 9వ రౌండ్  లో 832  ఓట్ల  మెజారిటీ దక్కింది.10  వ   రౌండ్  లో 484 ఓట్లు ,11వ రౌండ్  లో 1358 ఓట్లు,  12వ రౌండ్  లో 2042 ఓట్ల  భారీ  ఆధిక్యం టీఆర్ఎస్ కు  దక్కింది.  , 13వ  రౌండ్  లో 1285 ఓట్ల మెజారిటీ  14వ రౌండ్ లో 1,055  ఓట్ల  మెజారిటీని  సాధించింది. 

also read:మునుగోడు బైపోల్ 2022: 14వ రౌండ్ లో టీఆర్ఎస్ హవా

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios