Asianet News TeluguAsianet News Telugu

ములుగు ఎమ్మెల్యే సీతక్కకు డాక్టరేట్‌.. గుత్తి కోయలపై గ్రంథం..

గుత్తి కోయల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై చేసిన గ్రంథానికి గానూ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకోనున్నారు. 

Mulugu MLA Seethakka got doctorate
Author
First Published Oct 12, 2022, 10:44 AM IST

ములుగు : ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. పొలిటికల్ సైన్స్ లో సోషల్ ఎక్స్‌క్లూషన్‌ అండ్ డిప్రివేషన్‌ ఆఫ్ మై గ్రాంట్ ట్రైబల్స్ ఆఫ్ ఎర్ట్స్ వైల్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్’ అనే అంశంలో ఆమె పరిశోధన పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ప్రస్తుతం మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ టీ తిరుపతిరావు గైడ్  ప్రొఫెసర్ గా  వ్యవహరించగా.. ప్రొఫెసర్ ముసలయ్య, ప్రొఫెసర్ అశోక్ నాయుడు, ప్రొఫెసర్ చంద్రునాయక్  పర్యవేక్షణలో ఆమె పరిశోధన చేశారు. ఉమ్మడి వరంగల్,  ఖమ్మం జిల్లాల్లోని గుత్తి కోయల సామాజిక,  ఆర్థిక స్థితిగతులపై చేసిన గ్రంథాన్ని ఆమె సమర్పించారు. ఈ క్రమంలో సోమవారం ఓయూ అధికారులు డాక్టరేట్ ను ప్రకటించారు. త్వరలోనే ఆమె పట్టా పొందనున్నారు. 

రాజాసింగ్ పై పీడీ యాక్ట్: కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

ఇదిలా ఉండగా, మార్చిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క చిన్న జీయర్ స్వామిపై మండిపడ్డారు. సమ్మక్క, సారలమ్మలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.  హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారంటూ చిన్న జీయర్ స్వామిపై ఆగ్రహించారు. మా తల్లులది వ్యాపారమా? లేక సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో మీరు చేస్తున్నదని వ్యాపారమా? అంటూ నిలదీశారు. 

తమ దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదని చెప్పారు. అదే.. 120 కిలోల బంగారంల గల సమతామూర్తి విగ్రహం చూడటానికే మీరు రూ. 150 టికెట్ పెట్టారని విమర్శించారు. ఈ రెండింటినీ పోలుస్తూ ఎవరిది వ్యాపారం? అంటూ అడిగారు. ‘మీది బిజెనెస్.. సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు’ అంటూ సీతక్క మండిపడ్డారు. అదే విధంగా ఆమె చిన్న జీయర్ స్వామిని నేరుగా విమర్శించారు. లక్ష రూపాయలు తీసుకోకుండా ఎవరైనా పేద వారికి ఇంటికి వెళ్లారా? అంటూ అడిగారు. 

చిన్న జీయర్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ స్వామిగా చిన్న జీయర్‌ను పేర్కొన్నారు. ఈ చిన్న జీయర్ స్వామికి తగిన బుద్ధి చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios