రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించే తీరిక ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించే తీరిక ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం వెనుక కుట్ర దాగి వుందని... దీనిపై సమగ్ర విచారణ జరపాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన .. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో పరిపాలన సాగడం లేదని ఎద్దేవా చేశారు.

అనేక రాజకీయ పార్టీల నుంచి గెలిచి వచ్చిన శాసనసభ్యుల్ని తమ పార్టీలోకి లాక్కుంటూ ముఖ్యమంత్రి రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించడం బాధాకరం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని భట్టి డిమాండ్ చేశారు.