గజ్వెల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసిఆర్ కు ఎమ్మార్పీఎస్ సెగ తాకింది. ఆయన కాన్వాయ్ వెళ్తుండగా ఎమ్మార్పీఎస్ కార్యకర్త కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్త ఆందోళనతో సిఎం కాన్వాయ్ కొద్దిగా స్లో అయింది. అయితే అక్కడే రెడీగా ఉన్న పోలీసులు సదరు ఎమ్మార్పీఎస్ కార్యకర్తను అదుపులోకి తీసుకుని అక్కడినుంచి తరలించాడు. దీంతో కేసిఆర్ కాన్వాయ్ రయ్ మంటూ అక్కడినుంచి వెళ్లింది. ఎమ్మార్పీఎస్ కార్యకర్త ఆందోళన వీడియో కింద ఉన్నది చూడండి.