కరీంనగర్: గత ప్రభుత్వాలు దళితులకు భూములు ఇస్తే పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో దళిత భూములను లాక్కుంటున్నారని ఎంఅర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. కేసిఆర్ ప్రభుత్యం మూడెకరాల భూమి ఇస్తానని దళితులకు హామీలిచ్చి ఇప్పుడు ఆ దళితుల వద్ద ఉండే భూమి లాక్కుంటుందని మంద కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''ముఖ్యమంత్రి కేసిఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో కలెక్టరేట్ కార్యాలయం దళితులకు కేటాయించిన భూముల్లో కట్టారు. అలాగే జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ మరియు ఇళ్ళందకుంటలో గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూములు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుంది. ఇలా దళితుల భూమి లాకొక్కుండ అడ్డుకుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారు'' అని తెలిపారు. 

read more  కేసీఆర్‌తో పాటు జగన్‌ను వదలని రేవంత్: పోరాటానికి సిద్ధమంటూ వ్యాఖ్యలు

''ప్రస్తుతం దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు రాబోయే రోజుల్లో కెసిఅర్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఈటల రాజేందర్ దళితుల భూమి అధికారులు లాక్కుంటే మౌనం వహిస్తున్నారని... రాబోయే రోజుల్లో ఆయన కూడా మూల్యం చెల్లించక తప్పదు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా దళితుల భూములు కాపాడుకోవడానికి ఉద్యమం చేస్తాం'' అని మందకృష్ణ ప్రకటించారు.