టిఆర్ఎస్ ఎంపి వినోద్

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించాలనడం సరికాదని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ విపక్షపార్టీలకు సూచించారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ... నోట్ల కష్టాలపై పార్లమెంట్‌ లో చర్చించాలని సూచించారు. లోక్‌ సభలో కాంగ్రెస్‌ బాధ్యతాయుతంగా వ్యహరించడం లేదని విమర్శించారు. వాయిదాలతో సభా సమయాన్ని వృధా చేస్తోందన్నారు.

శనివారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రధాని మోదీని కలుస్తారని చెప్పారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రధానికి కేసీఆర్‌ లిఖితపూర్వక సూచనలు ఇస్తారని వెల్లడించారు.