చిరు ఎఫెక్ట్: ఎంపీ సంతోష్ కుమార్ కు ఊరట, సీఎంవో అలర్ట్
మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కలిశారు. కేసీఆర్ తో చిరంజీవి, నాగార్జున భేటీలో ఆయన కూడా ఉన్నారు. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ఊరట లభించింది. ఆయనకు కరోనా నెగెటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో చిరంజీవి, నాగార్జున జరిగిన భేటీలో ఆయన కూడా ఉన్నారు. దాంతో సంతోష్ కుమార్ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. అయితే, ఆయనకు నెగెటివ్ వచ్చింది.
ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసానికి చిరంజీవి వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ అదికారులతో, చిరంజీవితో చిత్రపరిశ్రమపై సమీక్ష నిర్వహించారు. దీంతో తెలంగాణ సీఎంవో అప్రమత్తమైంది. ప్రగతి భవన్ లో ఆ రోజు సమావేశంలో పాల్గొన్న అదికారులు,నేతలు కరో పరీక్షలు చేయించుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కోరనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. చిరంజీవి ఇటీవల సినీ నటుడు నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో ప్రగతిభవన్ లో భేటీ అయ్యారు. చిరంజీవి, నాగార్జున తెలుగు సినిమాకు సంబంధించిన విషయాలపై మొన్న కేసీఆర్ తో చర్చించారు.
ఆచార్య సినిమా షూటింగ్ కు ముందు తాను కోవిడ్ పరీక్షలు చేయించుకుున్నానని, ఆ సమయంలో తనకు ఏ విధమైన కరోనా లక్షణాలు కనిపించలేదని ఆయన చెప్పారు.
అయినా తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లు చిరంజీవి తెలిపారు. తనను కలిసిన ఇద్దరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.