Asianet News TeluguAsianet News Telugu

దమ్ముంటే సిద్దిపేటలో కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలవాలి.. రఘునందన్‌రావుకు ఎంపీ కొత్త ప్రభాకరెడ్డి సవాలు..

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సవాలు విసిరారు. రఘునందన్‌కు దమ్ముంటే సిద్దిపేటలో కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలవాలని అన్నారు. 

MP Kotha prabhakar reddy Challenge to BJP MLA RaghuNandan rao
Author
First Published Dec 27, 2022, 2:55 PM IST

ఉమ్మడి  మెదక్ జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సవాలు విసిరారు. రఘునందన్‌కు దమ్ముంటే సిద్దిపేటలో కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలవాలని అన్నారు. రఘునందన్ రావు సవాలుకు సిద్దమైతే.. సిద్దిపేటలో తమ పార్టీ చెందిన ఒక కౌన్సిలర్‌ను బతిమాలి రాజీనామా చేయిస్తానని అన్నారు. రఘునందన్‌కు దమ్ముంటే వచ్చి పోటీ చేసి గెలవాలని అన్నారు. 

అయితే దీనిపై స్పందించిన రఘునందన్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పారని విమర్శించారు. రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణి చేస్తానన్న సీఎం కేసీఆర్ కోటి మంది తాగుబోతుల వీణగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క గ్రామంలో కూడా 24 గంటల కరెంట్ రావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ధరణిలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే కొత్త ప్రభాకర్ రెడ్డితో ఎంపీ పదవికి రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని సవాలు విసిరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios