సింగరేణి ఎన్నికలు ఆషామాషీ కాదు జాతీయ సంఘాలతో ఒరిగేదేమీ లేదు ఎవరి వల్ల మేలు జరుగుతుందో వాళ్లకే ఓటేయాలి
సింగరేణి ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల హక్కులను కాలరాశాయని ఆమె ధ్వజమెత్తారు. కార్మికుల సమస్యలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. మూతపడ్డ అనేక బొగ్గు బావులను మళ్లీ తెరిపించామని గుర్తు చేశారు
కార్మికులకు బొగ్గు బావుల్లో ఏసీ సదుపాయం కల్పిస్తామన్నారు. అంబేద్కర్ జయంతికి సెలవు ప్రకటిస్తామన్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ విషయంలో జాతీయ సంఘాలు పట్టించుకోలేదన్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడారని తెలిపారు.
టీబీజీకేఎస్‌ను గెలిస్తే మరిన్ని మంచి పనులు చేస్తామని ప్రకటించారు. ఎవరికి ఓటేస్తే సింగరేణి అభివృద్ధి చెందుతుందో కార్మికులు ఆలోచించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని ఎంపీ కవిత ఉద్ఘాటించారు. సింగరేణి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని స్పష్టం చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
