రాజకీయాల్లో ఒకరిద్దరు మహిళలు ఉన్నా ఇంకా అవకాశాలు మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.​

మార్చి 8 న వస్తుందంటే చాలు పాలకులంతా మహిళాసాధికారత గురించి ఉపన్యాసాలు దంచేస్తుంటారు. ఆ తర్వాత షరా మూములే.

మరీ ముఖ్యంగా రాజకీయాల్లో మహిళ ప్రాధాన్యం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. పెత్తన్నం ఇంటాయనది సంతకం మాత్రం ఇంటావిడదిలా ఉంటుంది మహిళా సర్పంచులు, మంత్రులు ఉన్నచోట.

ఇక తెలంగాణ పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు. అసలు రాష్ట్రంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. దీని గురించి బయటి నుంచే కాదు ఇంటి నుంచి కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి.

నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తాజాగా మరోసారి కేబినెట్ లో మహిళకు చోటు పై స్పందించారు. ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం ముఖ్యమైన ఘట్టమే అని ఆమె పరోక్షంగా అంగీకరించారు.


సోమవారం హైదరాబాద్‌లో బ్రిటిష్‌ కౌన్సిల్‌, డియాజియో సంయుక్తాధ్వర్యంలో జరిగిన యంగ్‌ ఉమెన సోషల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవల్‌పమెంట్‌ ప్రొగ్రామ్‌లో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో ఒకరిద్దరు మహిళలు ఉన్నా ఇంకా అవకాశాలు మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.