జర్నలిస్టులకు టిఆర్ఎస్ కవిత వరాలు

First Published 5, Apr 2018, 7:26 PM IST
mp kavith visits new delhi telangana bhavan
Highlights
మిగిలిన సమస్యలు కూడా చూడు అక్క జర

గురువారం ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కల్వుంట్ల కవిత  తెలంగాణ భవన్ అదికారులతో‌ సమావేశ మయ్యారు. జర్నలిస్టుల కోసం శాశ్వతంగా మీడియా రూమ్ ఎర్పాటు చేయాలని, అన్ని సదుపాయాలు కల్పించాలని మీడియా సెంటర్ లో సిబ్బంది సంఖ్యను పెంచాలని సంబంధిత అధికారులను కోరారు. ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ జర్నలిస్టులకు హెల్త్ కార్డ్ లను ఢిల్లిలోని‌ అన్ని హాస్పిటల్స్ లో వర్తిం చేలా చూడాలని  తెలంగాణ భవన్ కమీషనర్ అశోక్ కుమార్ కి  సూచించారు. భవన్ లో తెలంగాణ రాష్ట్రాంలో ప్రాచుర్యంలో ఉన్న చేనేత వస్త్రాలు, బిర్యానిఇతర ప్రాంతీయ ఆహార పదార్థాల కోసం  ఫుడ్ సెంటర్ లను ఏర్పాటు చేయ్యాలని అధికారులకు చెప్పారు.

ఈ సంద్భంగా తెలంగాణ భవన్ జర్నలిస్ట్ ల సంఘం అధ్యక్షులు ఎల్. ప్రవీణ్ కుమార్ప్రధాన కార్యదర్శి పబ్బ సురేష్ బాబు, ఉపాధ్యక్షులు దోమల్ కామరాజు, అశోక్ రెడ్డి, కోశాధికారి భాస్కర్ తదితరులు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత తో జర్నలిస్ట్ లు ఢిల్లీ లో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని డిల్లీ జర్నలిస్టులకు ఎంపి కవిత హామీనిచ్చారు. ఏ యిబ్బంది ఉన్నా తనకు తిలియజేయమని చెప్పారు. ఎంపి కవిత వెంట డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి ఉన్నారు.

loader