పార్లమెంట్ లో ఎంపీ బూర నర్సయ్య గౌడ్
పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణకు రూ.12 వందల కోట్ల లోటు బడ్జెట్ ఏర్పడుతుందని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
బడ్జెట్ లోటుపై ప్రధానితో చర్చించేందుకే సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వస్తున్నారని తెలిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
