హైదరాబాద్: బీజేపీ తెలంగాణ ఇంఛార్జీ కృష్ణదాస్ కి కరోనా సోకింది. దీంతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాడు.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే విషయమై కృష్ణదాస్ తో బండి సంజయ్ ఈ నెల 14వ తేదీన కృష్ణదాస్ తో సమావేశమయ్యారు.ఈ సమావేశం తర్వాత కృష్ణదాస్ కు కరోనా సోకినట్టుగా తేలింది. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ ఇవాళ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాడు.  పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకొని  ఎంపీలకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో సుమారు 17 మంది ఎంపీలకు కరోనా ఉన్నట్టుగా తేలింది. ఈ 17 మందిలో ఏపీకి చెందిన ఇద్దరు వైసీపీ ఎంపీలు కూడ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలకు కరోనా నెగిటివ్ గా తేలింది.

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 49 లక్షలను దాటాయి. గత 24 గంటల్లో దేశంలో 83,808 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1054 మంది కరోనాతో మరణించారు.కరోనాతో మరణించినవారి సంఖ్య 80,776కి చేరుకొంది.