కరీంనగర్: అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే
 మంత్రి గంగుల కమలాకర్ చేసిన అవినీతి, అక్రమాలతో పాటు ఇతర వ్యవహరలకు సంబంధించిన ఫైల్ ను రెడీ చేసినట్లు... త్వరలోనే ముఖ్యమంత్రికి అందించనున్నట్లు వెల్లడించారు.  మంత్రి పక్కన ఉన్న వ్యక్తులు, అనుచరుల వల్లే ఆయన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవి కూడా పోతుందని హెచ్చరించారు.  

''బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రాష్ట్రం మొత్తం పర్యటించాను. మంత్రిగా నువ్వు ఎక్కడికి వెళ్లావు. రాష్ట్రం అభివృద్ది కోసం మంత్రి గంగుల కమలాకర్ ను అన్నలా భావించి ఇద్దరం కలిసి పని చేయడానికి సిద్దం. నువ్వు సిద్దమా. నీకు మంత్రి పదవి ఎలా వచ్చిందో కరీంనగర్ జిల్లా మొత్తం తెలుసు...పదవి కాపాడుకోవడం కోసమే నాపై విమర్షలు చేస్తున్నావు. తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా జెండాను ఎక్కడ ఎగరవేస్తారో తెలియని మంత్రి మనకు ఉండటం మన కర్మ'' అని గంగులపై సంజయ్ మండిపడ్డారు. 

read more   తెలంగాణలో కోవిడ్ విలయతాండవం: మంత్రి హరీశ్ రావు పీఏకు కరోనా..?

''రాష్ట్రంలో కరోస పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రం కరోన కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎన్ని కరొన పరీక్షలు నిర్వహించారో ప్రభుత్వం ప్రకటించాలి'' అని డిమాండ్ చేశారు. 

'' కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు మనోజ్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఆర్ధిక సాయం చేయాలి. తెలంగాణ బిజెపి తరపున కూడా సాయం అందిస్తున్నాము. ఇక బిజెపి కార్పోరేటర్ పార్టీ మారడం వారి విజ్ఙతకే వదిలేస్తాము'' అని బండి సంజయ్ అన్నారు.