Asianet News TeluguAsianet News Telugu

MLC elections: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్.. ఎంపీ బండ ప్రకాష్‌కు టికెట్.. అందుకోసమేనా..?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ( MLC election) సంబంధించి టీఆర్‌ఎస్ (TRS) అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న బండ ప్రకాష్‌ను (banda prakash) ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ నిర్ణయం వెనకాల సీఎం కేసీఆర్ (CM KCR) భారీ కసరత్తే జరిపినట్టుగా తెలుస్తోంది.
 

mp Banda Prakash as TRC MLC Candidate likely to get cabinet berth
Author
Hyderabad, First Published Nov 16, 2021, 11:46 AM IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ( MLC election) సంబంధించి టీఆర్‌ఎస్ (TRS) అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి,  కడియం శ్రీహరి, తక్కళపల్లి రవీంద్రరావు, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ కలెకర్టర్ వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్ (banda prakash) పేర్లను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వీరు అసెంబ్లీకి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. నేటితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయినట్టే. 

ఇక, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేసీఆర్ గత రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, సామాజిక సమీకరణాలు, జిల్లాల ప్రాతినిధ్యం, పార్టీ పట్ల విధేయత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. 

mp Banda Prakash as TRC MLC Candidate likely to get cabinet berth

Also read: బండా ప్రకాశ్ తో సహా ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్.. ఏకగ్రీవాలే..

అయితే నేడు ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాలో ఐదుగురి పేర్లు తొలి నుంచి ప్రచారంలో ఉన్నవే. అయితే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న banda prakashకు ఎమ్మెల్సీ టికెట్‌కు ఇవ్వడం మాత్రం చాలా మంది ఊహించలేదు. దీని వెనక కేసీఆర్ పెద్ద కసరత్తే చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గం కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ముదిరాజ్ వర్గం నుంచి టీఆర్‌ఎస్‌లో బలమైన నేతగా ఎదిగిన ఈటల రాజేందర్.. ఇటీవల చోటుచేసుకన్న పరిణామాల నేపథ్యంలో పార్టీకి దూరం కావడం.. హుజురాబాద్‌లో బీజేపీ నుంచి బరిలో నిలిచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన బండి ప్రకాష్‌ను ఎమ్మెల్సీగా తీసుకోవడం ద్వారా కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. Mudiraj సామాజిక వర్గానికి కేబినెట్‌లో ప్రాతినిథ్యం ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకన్నట్టుగా తెలుస్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో బండి ప్రకాష్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారని టీఆర్‌ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ముదిరాజ్ సామాజిక వర్గంలో మద్దతు కూడగట్టడంలో భాగంగానే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక, బండ ప్రకాష్‌ ఎమ్మెల్సీ కావడంతో.. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఆయన పదవీకాలం మరో మూడున్నరేళ్లు ఉంది. దీంతో ఆ ఖాళీ అయిన స్థానాకిని మాజీ స్పీకర్ మధుసూదనచారిని పంపించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి మధుసూదనచారికి ఎమ్మెల్సీ టికెట్ ఖాయమనే ప్రచారం కూడా సాగింది. అయితే ఆయనను రాజ్యసభకు పంపించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు తన కూతురు కవితను రాజ్యసభ పంపే అవకాశాలను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మరికొద్ది  రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  

Follow Us:
Download App:
  • android
  • ios