Asianet News TeluguAsianet News Telugu

ఈవీఎం మొరాయించడంతో క్యూలైన్ లోనే బాల్క సుమన్...

చెన్నూరు టీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ బాల్క సుమన్ తన స్వస్థలం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓటు హక్కును వినియోగించుకోడానికి వెళ్లారు. అయితే ఆయన ఓటేయాల్సిన ఒకటో వార్డు పోలింగ్ బూతులో ఈవీఎం మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆ పరిధిలోని ఓటర్లతో పాటు సుమన్ కూడా క్యూలైన్ లోనే వేచి చూడాల్సి వచ్చింది. 
 
mp balka suman waiting queline due to evm issue
Author
Metpally, First Published Dec 7, 2018, 8:17 AM IST

చెన్నూరు టీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ బాల్క సుమన్ తన స్వస్థలం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓటు హక్కును వినియోగించుకోడానికి వెళ్లారు. అయితే ఆయన ఓటేయాల్సిన ఒకటో వార్డు పోలింగ్ బూతులో ఈవీఎం మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆ పరిధిలోని ఓటర్లతో పాటు సుమన్ కూడా క్యూలైన్ లోనే వేచి చూడాల్సి వచ్చింది. 

తొందరగా ఇక్కడ ఓటేసి తాను పోటీ చేస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో పోలింగ్ ఎలా జరుగుతుందో పరిశీలించాలని సుమన్ భావించారు.  అయితే ఈవీఎం సమస్యతో ఆలస్యం
కావడంతో సుమన్ అసహనం వ్యక్తం చేశారు.  

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలకుమ అన్నిచోట్లా పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 2.81 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 11 తారీఖున జరిగే ఓట్ల లెక్కింపు ద్వారా అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 
   
Follow Us:
Download App:
  • android
  • ios