ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఓటుహక్కును ఓటర్లు సక్రమంగా వినియోగించుకునేలా చూడాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈసీని కోరారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను ఇవాళ సచివాలయంలో కలిసి ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా ఓటర్లు మధ్యం తాగి ఓటు వేయకుండా నివారించేందుకు పోలింగ్ బైతుల్లో బ్రీత్‌ ఎనలైజర్‌లను ఏర్పాటు చేయాలని కోరారు.తెలంగాణ నుంచే అందుకు శ్రీకారం చుట్టాలని కేతిరెడ్డి వినతి పత్రం సమర్పించారు. 

ఈ అంశంపై రజత్ కుమార్ స్పందిస్తూ... కేతిరెడ్డి ప్రయత్నాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం చట్టం తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళతానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికే కేతిరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు కాబట్టి కోర్టుద్వారా ఆదేశాలు వస్తే ఆయన ప్రయత్నం సఫలమవుతుందని అన్నారు.

రజత్‌కుమార్‌ను కలసిన అనంతరం మీడియాపాయింట్‌ వద్ద కేతిరెడ్డి విలేఖరులతో మాట్లాడారు. ఈ వీడియోను కింద చూడండి. 

"