తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు చేశారు. సిఎం కేసిఆర్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేసిఆర్ పని తొందర్లోనే ఖతమైపోతుందని హెచ్చరించారు. కేసిఆర్ మీద చాలా కుట్రలు జరుగుతున్నాయన్నారు. కానీ తాము ఆ కుట్రలో భాగస్వాములం కాలేదన్నారు. తమను ఇబ్బందులపాలు చేయాలని చూస్తే మాత్రం కేసిఆర్ ను ఉంచాలా? దింపాలా ఆలోచిస్తామని హెచ్చరించారు. వర్గీకరణ విషయంలో తెలంగాణ సర్కారు వైఖరి సరిగ్గాలేదన్నారు. మంద కృష్ణను జైలులో వేయడం పట్ల నిప్పులు చెరిగారు. ఇంకా ఏమన్నారో ఈ కింది వీడియోలో చూడండి.