రేవంత్ రెడ్డిని నమ్మితే ఏమైంది...: బాబుపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

Mothkupalli fires at Chnadrababu and praises KCR
Highlights

కేసిఆర్ గురించి ఏమన్నారో తెలుసా ?

మహానాడు కు ఆహ్వానం అందకపోవడంతో ఆగ్రహంగా ఉన్నారు తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు. ఆయన తన మనసులో ఉన్న ఆవేదనను, ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఆయన ఏమన్నారంటే?

చంద్రబాబు కోసం దెబ్బలు తిన్నాను. ఆయనను నమ్మాను కానీ నాకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. చంద్రబాబు కనీసం 5 నిమిషాలు మాట్లాడే సమయం ఇవ్వలేదు ఎందుకు ? రేవంత్ రెడ్డి బిడ్డ పెండ్లికి చంద్రబాబు దగ్గరుండీ అన్నీ చేశారు. కానీ నాబిడ్డ పెండ్లికి సాయంత్రం ఎప్పుడో నాలుగు గంటలకు ఎప్పుడో వచ్చారు.

రేవంత్ పనికిమాలిన వ్యక్తి. ఆయనను నమ్మి పార్టీని నాశనం చేశారు. రేవంత్ ను చంద్రబాబు నమ్మారు. లాస్టుకు ఏమైంది? చంద్రబాబు మాటలు తెలంగాణలో నమ్మేదెవరు? అయినా ఆరు నెలలకు ఒకసారి వస్తే కార్యకర్తల పరిస్థితి ఏంటి ? రానున్న ఎన్నికల్లో ఆంధ్రాలో టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందా? రాదా అన్న అనుమానాలున్నాయి. కేసిఆర్ డబ్బులు లేని వాళ్లకు రాజ్యసభ సీట్లు ఇచ్చారు. కేసిఆర్ ఎస్సీ వర్గీకరణ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు ఎందుకు ఆ పనిచేయడంలేదు. అపాయింట్మెంట్ కోసం ఆరు నెలలు వేచి చూశాను. కానీ నాకు చంద్రబాబు అపాయింట్మెంట్ రాలేదు. చంద్రబాబు మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. కానీ నాకు అన్యాయం జరిగింది.

loader