గంజాయికి అలవాటు పడిన కొడుకుకు ఓ తల్లి గట్టిగా బుద్ది చెప్పింది.  గంజాయికి అలవాటు పడిన 15 ఏళ్ల కొడుకును విద్యత్ స్థంభానికి కట్టేసి కళ్లలో కారం కొట్టింది. 

కోదాడ: గంజాయికి అలవాటుపడిన కొడుకుకు ఓ తల్లి గట్టిగా బుద్ది చెప్పింది. విద్యుత్ స్థంభానికి కట్టేసి కళ్లలో కారం కొట్టింది తల్లి. Ganja అలవాటును మాన్పించేందుకు గాను Son కు ఈ శిక్ష విధించింది.

Suryapeta జిల్లా Kodada పట్టణానికి చెందిన 15 ఏళ్ల Minor boy ప్రతి రోజూ గంజాయి సేవించి ఇంటికి వస్తున్నాడు. గంజాయిని మానుకోవాలని ఆమె కొడుకును కోరింది. కానీ అతను మానుకోలేదు. సోమవారం నాడు ఉదయం కొడుకును తన ఇంటికి ఎదురుగా ఉన్న విద్యుత్ స్థంభానికి కట్టేసింది. పక్కనే ఉన్న మరో మహిళ సహాయం తీసుకొంది. పొరుగున ఉన్న మహిళ బాలుడి రెండు చేతులు పట్టుకున్న సమయంలో బాలుడి కంట్లో తల్లే స్వయంగా కళ్లలో Red Chilli కొట్టింది.

దాదాపుగా 10 రోజులుగా మైనర్ బాలుడు మాత్రం ఇంటికి రావడం లేదు. అయితే అంతకు ముందు నుండే ఈ బాలుడికి గంజాయి సేవించే అలవాటుందని Mother గుర్తించింది. గంజాయి తాగడం కోసమే ఆ బాలుడు ఇంటికి కూడా రావడం లేదని తల్లి గుర్తించింది. ఇవాళ ఇంటికి వచ్చిన కొడుకును విద్యుత్ స్థంభానికి కట్టేసి చితకబాదింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గంజాయి సరఫరా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కూడా ఆమె కోరింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. Andhra Pradesh, Telanganaరాష్ట్రానికి కోదాడ పట్టణం సరిహద్దులో ఉంటుంది. రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ప్రాంతం కావడంతో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా ఉంది. గంజాయి అక్రమ రవాణకు చెక్ పెట్టేందుకు పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. 

రాష్ట్రంలో డ్రగ్స్ తో పాటు గంజాయి సరఫరా చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని సీఎం KCR ప్రకటించారు. పోలీసులు, ఎక్సైజ్ శాఖాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి మత్తు పదార్ధాల రవాణ, సరఫరాకు చెక్ పెట్టాలని సీఎం ఆదేశించారు. నార్కోటిక్ వింగ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. డ్రగ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో గత వారంలోనే బీటెక్ విద్యార్ధి మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లక్ష్మీపతి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

మరో వైపు పంజాబ్ రాష్ట్రం నుండి కారు చౌకగా డ్రగ్స్ ను తీసుకొచ్చి హైద్రాబాద్ లో సరఫరా చేస్తున్న ఇద్దరు సభ్యులను గత వారంలోనే రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ, 3 కోట్లకు పైగా ఉంటుందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఇదిలా ఉంటే మరో వైపు హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని పుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపుతుంది. ఈ విషయమై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పబ్ పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ సీఐ నాగేశ్వరరావునే బంజారాహిల్స్ సీఐగా నియమించారు. హైద్రాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో కూడా మత్తు పదార్ధాలు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసకొంటామని పోలీసు శాఖ హెచ్చరించింది.