Mother tortured : మద్యం మత్తులో మూడేండ్ల చిన్నారిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. హవేలిఘణాపూర్ మండలం పోచమ్మరాల్ గ్రామానికి చెందిన కవితకు మద్యం మత్తులో తన కూతురుపై విచక్షణ రహితంగా ఉంది. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.
Mother tortured: కంటి రెప్పలా చూసుకోవాల్సిన తల్లి .. మద్యం మత్తులో ముక్కుపచ్చలారని తన కన్నబిడ్డను చిత్రహింసలకు గురి చేసింది. అత్యంత కిరాతకంగా చిన్నారిపై దాడి చేసి.. మాతృత్వానికే మాయని మచ్చగా మిగిలింది. చిన్నారిపై కన్న తల్లి దాష్టీకానికి పాల్పడిన ఘటన సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. హవేలిఘణాపూర్ మండలం పోచమ్మరాల్ గ్రామానికి చెందిన కవితకు వైష్ణవి, నిత్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. యాచక వృత్తి చేస్తూ.. కాలమొల్లాదీస్తుండేది. ఈ క్రమంలో ఆమె మద్యం, ఇతర వ్యసనాలకు బానిసగా మారింది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద .. పీకల్లాదాకా.. తాగినా కవిత .. మద్యం మత్తులో తన మూడేళ్ల కూతురు నిత్యపై విచక్షణా రహితంగా దాడి చేసింది. ఇష్టానూసారంగా చితకబాదింది.
దీంతో ఆ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ చిన్నారి పరిస్థితి చూసి చలించిన స్థానికులు మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ముఖం, తల భాగాల్లో తీవ్రగాయాలుండటంతో అక్కడి వైద్యులు సీటీ స్కాన్ చేయాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ సమీఉద్దీన్ వెంటనే ఆస్పత్రికి వెళ్లి చిన్నారికి సీటీ స్కాన్ చేయించారు. అయితే.. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంలో పాపను హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. మూడేళ్ల పసిపాపను మద్యం మత్తులో కొట్టి ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చిన తల్లిపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మద్యం మత్తులో తండ్రి హత్య.. అనంతరం ఆత్మహత్య చేసుకున్న కొడుకు
మద్యం మత్తులో తండ్రిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఓ కొడుకు.. తర్వాత తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ధర్మవరంలో చిలకలూరిపేట మండలం పసుమర్రు లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో జాలాది సీతారామయ్య(75), బుచ్చమ్మను అనే దంపతులు గత నలభై ఏండ్లుగా ఇదే గ్రామంలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కాగా, పెద్ద కుమారుడు బాలకృష్ణ, చిన్న కుమారుడు శంకర్. వీరి కూడా పెళ్లిళ్లు అయ్యాయి. వేరుగా జీవనం సాగిస్తున్నారు.
ఆస్తి పంపకాల్లో భాగంగా.. సీతారామయ్య తనకున్న 2.30 ఎకరాల భూమిని కుమారులకు చెరో ఎకరం భూమి ఇచ్చాడు. తన వద్ద 30 సెంట్లు ఉంచుకున్నాడు. అంతే బాగానే ఉన్న.. తన చిన్న కొడుకు శంకర్ తాగుడుకు బానిస అయ్యాడు. ఆస్తి విషయమై తండ్రితో తరుచు గొడవ పడే వాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన శంకర్ తన తండ్రితో గొడవపడి కత్తితో పొడిచాడు. కాగా తర్వాత శంకర్ మనస్తాపంతో ఇంట్లోకి వెళ్ళి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సీతారామయ్యను 108లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందాడు. ఘటనాస్థలాన్ని సీఐ రాజేష్, ఎస్సై కమలాకర్‌లు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
