ఏడేళ్ల కొడుకుతో కలిసి తల్లి ఆత్మహత్య

Mother, son commit suicide
Highlights

కుటుంబ కలహాలే కారణమా?

కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఏడేళ్ల కుమారుడితో కలిసి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లీ కొడుకుల శరీరాలు దాదాపు 90 శాతం కాలిపోవడంతో ఇద్దరూ మృత్యువాతపడ్డారు. ఈ విషాద సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. ధరూరు మండలం చింతరేవు ల గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌- హసీనా భార్యా భర్తలు. వీరికి పదేళ్ల కిందట పెళ్లవగా ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. భర్త ఊరూరు తిరుగతూ గాజులు అమ్మే వ్యాపారం చేయగా హసీనా ఇంటివద్దే ఉండేది.

ఈ క్రమంలో అత్తతో హసీనాకు తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రంజాన్ పండగ కోసం ఏర్పాట్లు చేస్తుండగా మళ్లీ అత్తా కోడళ్ల మద్య చిన్న ఘర్షణ జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన హసీనా దారుణానికి పాల్పడింది. తన ఏడేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. యొదట చిన్నారి ఒంటిపై కిరోసిన్ పోసి ఆ తర్వాత తాను కూడా పోసుకుని నిప్పంటించుకుంది.

దీన్ని గమనించిన కుటుంబసభ్యులు మంటలను ఆర్పి 108 కు సమాచారం అందించారు. ఇందులో గద్వాల ఆస్పత్రికి తరలించారు.  పరిస్థితి విషయంగా ఉండటంతో కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా కొడుకుమహ్మద్‌ మృతి చెందాడు. ఆస్పత్రిలో చేరిన కొద్దసేపటికే హసీన కూడా మరణించింది.

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


 

loader