ఆన్ లైన్ ఆటలో రూ.36 లక్షలు పోగొట్టి బాలుడు.. గేమ్ ఆడుతూ.. డబ్బులు పెడుతూ..ఊడ్చేశాడు..

హైదరాబాద్ లో మరోసారి ఆన్ లైన్ గేమింగ్ యాప్ కు మరో కుటుంబం నష్టపోయింది. ఏకంగా 36 లక్షలు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించింది. ఓ బాలుడు చేసిన నిర్వాకంతో ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. 

Mother Loses Rs 36 Lakh After Son Downloads Online Game in Hyderabad

హైదరాబాద్ : internetలో ఆటలాడి రూ. 36 లక్షలు పోగొట్టాడు ఓ బాలుడు. Hyderabad Cyber ​​Crime ఏసిపి కెవిఎం ప్రసాద్ కథనం ప్రకారం.. అంబర్పేట్ కు చెందిన బాలుడు (16) తన తాత మొబైల్ తీసుకుని అందులో ‘Free Fire Gaming’ యాప్ ను డౌన్లోడ్ చేశాడు. తాత ఫోన్లో ఉన్న తన తల్లి అకౌంట్ నుంచి మొదటగా రూ.1500 పెట్టి ఆట మొదలు పెట్టాడు.  తర్వాత పదివేల చొప్పున డబ్బులు పెట్టాడు. అలా HDFC బ్యాంకు నుంచి తొమ్మిది లక్షలు ఆడేశాడు. ఆ తర్వాత ఎస్బిఐ బ్యాంకు ఖాతాలో నుంచి ఒక్కసారి రూ. 2 లక్షలు, మరోసారి రూ. 1.60 లక్షలు, రూ. 1.45 లక్షలు.. ఇలా విడతలవారీగా రూ. 27 లక్షలతో ఆడాడు. 

బాలుడి తల్లి తనకు డబ్బులు అవసరం అయి బ్యాంకుకు వెళితే ఖాతా ఖాళీ అని అధికారులు చెప్పారు. దాంతో బాధితురాలు హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా హెచ్డిఎఫ్సి ఖాతా నుంచి తొమ్మిది లక్షలు, ఎస్బిఐ ఖాతా నుంచి 27 లక్షలు పోయినట్లుగా గుర్తించారు. ఈ డబ్బు తన భర్త కష్టార్జితం అని ఆయన సైబరాబాద్ పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసేవారని.. ఆయన మృతితో వచ్చిన ప్రయోజనాలే ఈ డబ్బు అని బాలుడి తల్లి పోలీసులతో చెప్పి వాపోయారు. 

కాగా, నిరుడు నవంబర్ లో హైదరాబాద్ లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆమెకు ఏడాది కిందటే అనారోగ్యంతో భర్త మరణించాడు. వీరికి ముగ్గురు పిల్లలు. భార్య నిరక్షరాస్యురాలు. భర్త చనిపోయేంతవరకు కాలు బయట పెట్టలేదు. ఈ స్థితిలో ఆ కుటుంబానికి ఆయన Insurance money భరోసాను ఇచ్చాయి. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అంతా సర్దుకుంటుంది అనుకున్న తరుణంలో రూ.99తో కొన్న Earphones ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసాయి.  

ఏకంగా రూ. 33 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు.  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మౌలాలి లో ఉండే ఓ వ్యక్తి లేబర్ కాంట్రాక్టర్ గా పనిచేస్తుండేవాడు. గతేడాది నవంబర్లో అనారోగ్యంతో మరణించాడు. Insurance company నుంచి ఆయన కుటుంబానికి యాభై లక్షల రూపాయలు అందాయి.  ముగ్గురు పిల్లలపై తలా పది లక్షల చొప్పున భార్య Fixed deposit చేయించింది. 

తన దగ్గర ఉన్న మిగతా డబ్బులు 2 బ్యాంకు ఖాతాలో ఒక దాంట్లో 28 లక్షలు మరో ఖాతాలో ఐదు లక్షలు జమ చేసింది. అయితే,  8వ తరగతి చదువుతున్న కుమార్తె ఆన్లైన్ క్లాసులు  వినేందుకు హెడ్ ఫోన్లు కావాలని అడిగింది.  Online లో  కొంటానంటే ఫోన్ ఇచ్చింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వాటి ధర రూ. 500 నుంచి రూ.600 వరకు ఉంది.  అయితే, ఓ వెబ్ సైట్ లో 99 రూపాయలకే ఇయర్ ఫోన్స్ అనే మెసేజ్ కనిపించడంతో అక్కడ కొనుగోలు చేసింది.  వారు  కొన్న వస్తువును జాగ్రత్తగా ఇంటికి తెచ్చి ఇచ్చారు.

కొన్ని రోజుల తర్వాత ఆమె మరి కొంత డబ్బులు జమ చేసేందుకు బ్యాంకుకి వెళ్ళింది. బ్యాలెన్స్ ఎంత ఉంది అని  ఎంక్వయిరీ చేస్తే  సున్నా ఉందని చెప్పారు.  ఐదు లక్షలు ఉండాలి కదా అని నిలదీస్తే... మాకేం తెలియదని సిబ్బంది వివరించారు. మరో ఖాతా పరిశీలనకు వేరే బ్యాంకు కి వెళ్లారు. ఇరవై ఎనిమిది లక్షలు ఉండాల్సిన accountలో రూపాయి కూడా లేదని తెలుసుకుని  షాక్ తిన్నారు.  వెంటనే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.  బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించగా,  ఆ రెండు ఖాతాలను ఖాళీ చేసేందుకు  Cyber ​​hackers కు 15 రోజులు పట్టినట్లుగా తేల్చారు.  ఆమె అవగాహన లేమి వారికి కలిసి వచ్చినట్లు గా గుర్తించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios